Saturday, September 19, 2009

ఎవడు తెలివైనవాడు

నాకు వచ్చిన ఒక మెయిల్లో కథ ఇది.

ఒక పిల్లాడు బార్బర్ షాపుకి వస్తాడు.పిల్లాడిని చుసిన మంగలి తన కస్టమర్ తో “వీడో పెద్ద మట్టిముద్ద.కావాలంటే మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను” అంటాడు.ఆ పిల్లాడిని దగ్గరకు పిలిచి ఒక చేతిలో 5 రూపాయల బిళ్ళా, మరో చేతిలో రూపాయి బిళ్ళలు 2 ఉంచి ఏది కావాలో తీసుకోమని చెప్తాడు. ఆ కుర్రాడు 2 రూపాయి బిళ్ళల్ని తీసుకుని వెళ్ళిపోతాడు.అప్పుడు ఆ మంగలి కస్టమర్తో “చెప్పాను కదా వాడు వట్టి శుంఠ అని” అంటాడు. బయటకి వచ్చిన కస్టమర్ కి ఆ పిల్లాడు కనిపిస్తాడు. పిల్లాడిని అయిదు రూపాయలు కాకుండాఎందుకు 2 రూపాయలు తీసుకున్నావ్ అని అడుగుతాదు.దానికి ఆ పిల్లాడు “నేను 5 రూపాయలు తీసుకున్న రోజున ఈ ఆట ఐపోతుంది” అంటాడు.

నీతి : పక్కవాడిని వెధవ అనుకునేవాడు ఇంకా పెద్ద వెధవ అవుతాడు

No comments:

Post a Comment