Saturday, September 19, 2009

చేతివాటం

ఎక్కడో చదివిన జోకు...

అమెరికా వెళ్ళిన మన మంత్రిగారొకరు ఒక అమెరికన్ మంత్రిగారి ఇంటికి వెళ్తారు. ఇంద్రభవనంలాంటి ఆ ఇల్లు చూసిన మన మంత్రిగారికి మతిపోతుంది.
మన మంత్రి : "ఇంత అద్భుతమైన ఇల్లు ఎలా కట్టుకున్నారు?"

కిటికీలోనుంచి దూరంగా ఉన్న బ్రిడ్జ్ ని చూపించి కన్ను కొట్టి

అమెరికన్ మంత్రి : "10 పర్సెంట్"

తర్వాత కొన్నిరోజులకి మన దేసం వచ్చిన అమెరికన్ మంత్రిగారు మన మంత్రిగారి ఇంటికి వెళ్తారు.ఈసారి దిమ్మెరబోవటం ఈయన వంతు మన మంత్రిగారి ఇల్లు చూసి. అదే విషయం అడిగిన అమెరికన్ మంత్రికి కిటికీలోనుంచి దూరంగా చూపిస్తూ

మన మంత్రి : "అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా?"

అక్కడేమీ కనిపించకపోవటంతో ఏమీ అర్థంకాని అమెరికన్ మంత్రి

అమెరికన్ మంత్రి : "ఎక్కడ?"

మన మంత్రి కన్ను కొట్టి "100 పర్సెంట్"

No comments:

Post a Comment