Saturday, September 19, 2009

వామ్మో జెయింట్ వీల్

ఏదో అనుకున్నాను కానీ జెయింట్ వీల్ లో తిరగటం ఇంత కష్టమనుకోలేదండీ బాబూ. మొన్నీ మధ్యే మొత్తం నలుగురం ఫ్రెండ్స్ శ్రీరామనవమికి దగ్గర్లో జరుగుతున్న జాతరకి వెళ్ళాం. అక్కడ జెయింట్ వీల్ చూసిన మా వాడొకడు నన్నడిగాడు ఎప్పుడైనా ఎక్కావా అని. నేను లేదనటంతో ఇంకేం పద ఎంజాయ్ చేద్దువుగానీ అని చెప్పి తీస్కెళ్ళాడు. మొదట మనసులో ఏదో కొంచెం భయంగానే ఉంది ఏమీ కాదని తెలిసినా. సర్లే ఇదేమీ బాలయ్య సినిమా చూడటంకంత్టే కష్టం కాదులే అని ఎక్కేశాను. ముందు ట్రిప్ లో ఎక్కిన వాళ్ళని దించుతూ,కొందరిని ఎక్కిస్తూ, దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు జెయింట్ వీల్ తిప్పే అతను. చిన పిల్లాడిలా ఎదురుచూశాను మా వంతు కోసం. కొద్దిసేపటికి మేమూ ఎక్కాం. చిన్నగా తిప్పటం మొదలుపెట్టాడు. పైకి వెళ్ళేటప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ కిందకి దిగేటప్పుడు వామ్మో.. ఎవరో పైనుంచి కిందకి విసిరేసినట్టూ,గాల్లో తేలిపోతున్నట్టూ రకరకాలుగా అనిపించింది. ఇక అది కొంచేం స్పీడ్ అందుకున్నాక చూడాలి ఒకటే కేకలు మొదలుఫెట్టాం. రెండు మూడు రౌండ్స్ తరవాత అలవాటైపోయి పెద్దగా ఏమీ అనిపించలేదు. ఎప్పుడైపోతుందా ఎప్పుడు దిగేద్దామా అని ఎదురుచూస్తుండగానే కొంచెం స్లో అవ్వటం స్టార్ట్ అయ్యింది. బతుకుజీవుడా అనుకున్నాం. తర్వాతి రౌండ్ వాళ్ళని ఎక్కించుకునే ముందు మాలో కొంతమందిని దించుతూ వాళ్ళని కొంతమందిని ఎక్కించుకుంటూ వీల్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. మా వంతు వచ్చినప్పుడు దిగుదాంలే అని మేము కుడా తాపీగా కూర్చున్నాం. కానీ మా అదృస్టం.. వాడు మమ్మల్ని దించటం మర్చిపోయి మళ్ళె తర్వాతి రౌండ్ స్టార్త్ చేసేశాడు. ఇక మా బాధలు చూడాలి. ఒకవైపు వికారంతో వాంతి అవుతున్న ఫీలింగ్,మరోవైపు మమ్మల్ని దించనందుకు వాడి మీద మంట, అసలు ఎక్కుదాం అన్న ఐడియా ఇచ్చిన మా వాడి మీద కోపం అన్నీ కట్టగట్టుకుని వచ్చేశాయ్. మళ్ళీ ఒక పావుగంట కళ్ళు మూసుకుని కూర్చుని ఎలాగో ఈసారి స్లో అవ్వగానే వెంటనే దిగేశాం. మా కోపం అంతా వీల్ తిప్పేవాడి మీద చూపించటంతో వాడు
“అదేంటి సార్.. ఒక్క ట్రిప్ కి డబ్బులిచ్చి రెండు తిరిగినందుకు సంతోషించాలి కానీ అలా అంటారేంటి” అన్నాడు. అంతే…. కోపం నషాళానికెక్కింది.

No comments:

Post a Comment